రాజమౌళి నిర్ణయంతో కొరటాల అప్‌సెట్

by Jakkula Samataha |
రాజమౌళి నిర్ణయంతో కొరటాల అప్‌సెట్
X

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఏ సినిమా చేసిన బ్లాక్ బస్టరే. ఒక్క మూవీ చేయాలని డిసైడ్ అయితే వంద శాతం ఎఫర్ట్స్ పెట్టేస్తాడు. టీం మొత్తాన్ని కూడా సినిమా కోసం హండ్రెడ్ పర్సెంట్ పని చేసేలా ప్రోత్సహిస్తాడు. మగధీర, బాహుబలి లాంటి భారీ బడ్జెట్ మూవీస్‌‌కు పని చేసిన హీరోలకు, ప్రధాన పాత్రల్లో నటించిన నటులను సినిమా పూర్తయ్యే వరకు అసలు వదిలిపెట్టలేదు. తన సినిమా రిలీజ్ అయ్యాకే మరో సినిమాను చేసేందుకు ఛాన్స్ ఇస్తాడు. బాహుబలి మూవీకి హీరో ప్రభాస్ దాదాపు మూడేళ్లు కేటాయించాడు.

ఇప్పుడు ఇదే సీన్ ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలకు రిపీట్ అవుతుంది. మూవీ రిలీజ్ అయితే కానీ… మరో సినిమా చేసే అవకాశం లేదని స్పష్టం చేశాడట రాజమౌళి. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తర్వాత ప్రాజెక్టులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. 2021, జనవరి 8న సినిమా రిలీజ్ అయ్యాకే మరో సినిమాకు కమిట్ అవ్వాలని సూచించాడట. అయితే ఈ ఎఫెక్ట్ డైరెక్టర్ కొరటాల శివపై పడింది. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యలో ప్రధాన పాత్రలో నటించేందుకు రాం చరణ్‌ను ఒప్పించాడు కొరటాల. కానీ షూటింగ్ ప్రారంభించేలోపే రాజమౌళి నుంచి ఈ కబురు అందడంతో కాస్త అప్ సెట్ అయ్యారట. ఇక చేసేదేమీ లేక 2021 వేసవిలో చరణ్ ఎపిసోడ్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

Next Story