సుక్కు దారిలో శివ..

by Shyam |
సుక్కు దారిలో శివ..
X

సుకుమార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన సినిమాల దర్శకుడిగా పేరొందిన అగ్ర డైరెక్టర్. తొలి చిత్రం ‘ఆర్య’ నుంచే..భిన్నమైన ఆలోచనలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించి ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన రూట్ మార్చినట్టు కనబడుతున్నారు. అందుకు సాక్ష్యమే రంగస్థలం. భిన్న ఆలోచనలతోనే కాకుండా కఠోర వాస్తవికతను మేలవిస్తూ మూవీలు చేస్తున్నారు. అలా వచ్చిందే ‘రంగస్థలం’. తెలుగు చలన చిత్ర రంగస్థలంపై అశేష ఆదరణ పొందింది ఆ సినిమా. అదే కోవలో ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప మూవీ చేస్తున్నారు. అయితే, సుకుమార్ కేవలం డైరెక్టర్‌గానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు. తన దగ్గర పని చేసిన ఏడీలకు(అసిస్టెంట్ డైరెక్టర్) తను నిర్మించే చిత్రాల ద్వారా డైరెక్టర్‌లు‌గా పరిచయం చేస్తున్నారు.

సుకుమార్ వేసిన అదే బాటలో మరో అగ్ర డైరెక్టర్ కొరటాల శివ కూడా నడువనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, డైరెక్టర్‌గా శివ కూడా అద్భుతమైన విజయాలు అందుకున్నారు. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే మూవీలు చేస్తున్న శివ నిర్మాతగా మారుతారని తెలుస్తోంది. తన దగ్గర చాలా కాలంగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ఓ లేడీ అసిస్టెంట్‌కు డైరెక్షన్ బాధ్యతను అప్పగించనున్నాడని అంటున్నారు. ఈ మూవీకి కథ..స్క్రీన్ ప్లే..మాటలను ఆయనే సమకూర్చనున్నట్టు చెబుతున్నారు. లాక్ డౌన్ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం. కొరటాల తాజా చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.

Tags: director sukumar, koratala siva, producer, tfi, megastar

Advertisement

Next Story