హీరోయిన్‌ వయసు పెరిగిందని భాదపడుతున్న అభిమాని

by Shyam |   ( Updated:2021-08-03 04:34:33.0  )
హీరోయిన్‌ వయసు పెరిగిందని భాదపడుతున్న అభిమాని
X

దిశ, సినిమా: బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ కొంకణా సేన్ శర్మ లాక్‌డౌన్‌లో డాగ్ పేరెంట్ అయిపోయానని తెలుపుతూ పోస్ట్ పెట్టింది. తను సేవ్ చేసిన డాగ్‌ను పెంచుకుంటున్నానని, తనకు ట్రైనింగ్ పూర్తి అయిందని తెలిపిన కొంకణా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ క్రమంలో ఓ అభిమాని రియాక్షన్‌పై స్పెషల్ అటెన్షన్ చూపించిన యాక్ట్రెస్ రిప్లై ఇచ్చింది. ‘మీరు ఏజ్‌డ్ అవుతుంటే బాధగా ఉంది. మీలాంటి ఆర్టిస్టులను ఇండస్ట్రీ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది. న్యాయం చేయలేకపోయింది. స్కూల్‌ లైఫ్‌లో మీరు నా క్రష్. ‘ఏక్ తి దయాన్’ తర్వాత మిమ్మల్ని చూడాలనుకున్నా. మీరు అద్భుతం’ అని ఫ్యాన్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. కాగా, దీనిపై స్పందించిన కొంకణా.. ‘అయ్యో బాధపడకు. యంగ్‌గా ఉన్నప్పుడు ట్రాజికల్‌గా చనిపోయే బదులు వయసు పైబడటమే మంచిది కదా’ అని సమాధానమిచ్చింది.

Advertisement

Next Story