- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందరినీ అరెస్ట్ చేద్దామా? :కొంకణ సేన్ శర్మ
దిశ, వెబ్‌డెస్క్: అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ‘తాండవ్’ మతపరమైన భావాలను కించపరిచిందంటూ టీంపై కేసులు నమోదయ్యాయి. డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్, అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్, నిర్మాత హిమాన్షు మెహ్రా, సిరీస్‌లో శివ క్యారెక్టర్ ప్లే చేసిన మహమ్మద్ జీషన్ ఆయుబ్‌పై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా, సిరీస్ పొలిటికల్ సెటైర్ అని మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం మా ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఆందోళనాకారుల డిమాండ్ మేరకు కొన్ని సీన్లు తొలగించారు. ఈ క్రమంలో తమపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను కొట్టేయాల్సిందిగా మేకర్స్ సుప్రీంకోర్టులో ప్లీ దాఖలు చేయగా.. 27న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం మేకర్స్‌కు వ్యతిరేకంగా తీర్పిచ్చింది.
Almost all involved in the show have read the script and signed the contract! Let’s arrest the whole cast and crew? https://t.co/xbqbQ641D7
— Konkona Sensharma (@konkonas) January 28, 2021
సిరీస్‌లో క్యారెక్టర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను నటుడికి ఆపాదించకూడదని యాక్టర్ మహమ్మద్ జీషన్ ఆయుబ్ తరఫు న్యాయవాది కోరగా.. ఈ వాదనను తోసిపుచ్చింది కోర్టు. స్క్రిప్ట్ చదివిన తర్వాతే సిరీస్ చేసేందుకు ఒప్పుకున్నారని.. అలాంటప్పుడు ఇందులో మీ పాత్ర ఉంటుందని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ట్విట్టర్ వేదికగా స్పందించారు యాక్టర్, రైటర్, డైరెక్టర్ కొంకణ సేన్ శర్మ. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించలేమని అభిప్రాయడ్డారు. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ చదివాకే సైన్ చేస్తారని.. అలాంటప్పుడు ‘తాండవ్’ కోసం పనిచేసిన టోటల్ కాస్ట్ అండ్ క్రూను అరెస్ట్ చేద్దామా? అని ప్రశ్నించారు.