- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్ పార్టీలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. ఎప్పుడు చేరుతాననేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ కావాలని తాను చాలా పోరాటం చేశానన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావడం సంతోషంగా ఉందని, తానే స్వయంగా కలుద్దామనుకున్నానని చెప్పారు. కానీ రేవంత్ రావడం సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎప్పుడైనా రావచ్చని ఆహ్వానించారు. కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశారని, ఐడియాలజీకి చేయలేదన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారని రేవంత్ విమర్శించారు. కానీ కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించిందని, అప్పు కోసం బ్యాంకులు, సంస్థల దగ్గరకు అవసరం లేదని, వాళ్లే ప్రభుత్వానికి అప్పు ఇవ్వవచ్చని రేవంత్ ఎద్దేవా చేశారు.