తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి కొండా?

by Anukaran |   ( Updated:2021-03-15 06:18:38.0  )
konda visweshwar reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలింది. చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. త్వరలో ఆయన బీజేపీలో చేరే అవకాశముందని సమాచారం. పార్టీ మార్పుపై తన అనచరులకు కొండా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కొండా కాంగ్రెస్‌ను ఎప్పుడో వీడాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పటివరకు మారలేదని అనచరులకు కొండా చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో కొండా కాంగ్రెస్‌ను వీడినట్లు అనుచరులకు చెప్పారు.

Advertisement

Next Story