శ్రీపతిపల్లిలో‌ సినిమా సందడి.. ‘కొండా’ కోసం ఆర్జీవీ

by Shyam |   ( Updated:2021-12-16 07:13:33.0  )
శ్రీపతిపల్లిలో‌ సినిమా సందడి.. ‘కొండా’ కోసం ఆర్జీవీ
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతి పల్లిలో గురువారం సినిమా సందడి మొదలైంది. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న “కొండా” సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు మారుమూల గ్రామమైన శ్రీపతి పల్లి సర్పంచ్ కేసీ రెడ్డి ప్రత్యూష రెడ్డి – మనోజ్ రెడ్డిల ఇల్లు ఇందుకు వేదిక అయింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో పాటు హాస్యనటుడు ఎల్బీ శ్రీరామ్, నూతనంగా వెండి తెరకు పరిచయం చేయనున్న హీరో హీరోయిన్‌తో పాటు ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులతో గ్రామం సందడిగా మారింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను సర్పంచ్ ప్రత్యూష రెడ్డి ఇంట్లో చిత్రీకరించారు. సినిమా షూటింగులు చూసేందుకు స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed