పొలిశెట్టి కామెడీ.. పొట్టచెక్కలయ్యే నవ్వు

by Shyam |   ( Updated:2020-06-03 04:40:59.0  )
పొలిశెట్టి కామెడీ.. పొట్టచెక్కలయ్యే నవ్వు
X

‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ తన గురించి మాట్లాడుకునేలా చేసిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.. బాలీవుడ్‌‌లో ‘చిచ్చోరే’ సినిమాతోనూ ఫుల్ క్రేజ్ సంపాదించాడు. తర్వాత ‘మహానటి’ సినిమా నిర్మించిన స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ‘జాతిరత్నాలు’ చేస్తున్నాడు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ అయిపోయిన నవీన్ పొలిశెట్టి.. రీసెంట్‌గా సోషల్ మీడియాలో నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు. లాక్‌డౌన్‌లో బ్యాచిలర్స్, సోమరులు ఎలా ఉంటారో చెప్తూ ‘క్వారంటైన్ కుకింగ్ మాస్టర్ క్లాస్’ పేరుతో పడి పడి నవ్వేలా చేస్తూ ఫుల్ ఫాలోవర్స్‌ను సంపాదించిన పొలిశెట్టి.. ఇప్పుడు పొట్టచెక్కలయ్యేలా నవ్వించే మరో వీడియోతో వచ్చేశాడు.

https://twitter.com/konavenkat99/status/1267835818028089344?s=20

‘2020 ఎంత ఎగ్జైటింగ్‌గా స్టార్ట్ అయింది.. ఎంతలా డిప్రెషన్‌కు తీసుకెళ్లింది’ అని చెప్తూ 2020 రివైండ్ పేరుతో చేసిన వీడియోలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. ఈ వీడియోలోనే ‘జాతి రత్నాలు’ సినిమా ప్రమోషన్స్ కూడా చేసిన నవీన్. . థియేటర్లలో సినిమా చూడలేరా..? అయితే నటులంతా మీ ఇంటికి వచ్చి నటించి వెళ్లిపోతారు ఎంజాయ్ చేయండి’ అంటూ ఓటీటీలపై సెటైర్ కూడా వేసే ప్రయత్నం చేశారు. లాక్‌డౌన్‌లో పనిమనిషి గొప్పతనం గురించి తెలుసుకుని తనకు గుడికట్టిస్తానని చెప్పడం.. డిప్రెషన్ ఏంట్రా ‘జాతిరత్నాలు’ చూసి నవ్వుకునేందుకు సిద్ధంగా ఉండమని 2020 ప్రారంభంలో ఫ్రెండ్‌కు చెప్పిన పొలిశెట్టి, లాక్ డౌన్ కారణంగా చివరకు అదే స్నేహితుడిని డిప్రెషన్‌ ట్యాబ్లెట్ అడగడం వీడియోలో హైలెట్‌గా నిలిచాయి. కాగా ఈ వీడియో చూసిన కోన వెంకట్ నవీన్‌పై ప్రశంసలు కురిపించారు. సూపర్ యాక్టింగ్.. వన్ మ్యాన్ షో అంటూ కాంప్లిమెంట్స్ ఇవ్వగా ధన్యవాదాలు చెప్పాడు పొలిశెట్టి.

Advertisement

Next Story