- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ చేతులెత్తేశారు.. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆగ్రహం
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లలో కేసీఆర్ చేతులెత్తేసి ఫాంహౌజ్ లో పడుకున్నాని, ప్రతి గింజ కొంటామని చెప్పి ఇప్పుడు ఎందుకు కొనరని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని నిస్సిగ్గుగా అటు సీఎం కేసీఆర్ ఇటు మంత్రి నిరంజన్‌రెడ్డి అనడం అత్యంత సిగ్గుమాలిన విషయమని అగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షా10 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి కమీషన్లతో కేసీఆర్ ఆరాచకపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అని రైతులను భయాందోళనకు గురిచేసే కేసీఆర్‌కు ఎలాంటి శిక్ష వేయాలనేది అయనే చెప్పాలన్నారు. ప్రతి గింజను కొంటామని చెప్పి ఇప్పుడు గింజ కొనడం తమ పని కాదని చెప్పడం అత్యంత హేయమైన చర్యగా తెలంగాణ సమాజం పరిగణిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి అని చెప్పి ప్రాజెక్టులు కట్టి కమీషన్లు రాగానే యాసంగి సీజన్ లో వరి సాగుపై ఆంక్షలు పెట్టడం అధికార పార్టీ ధనదహానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రత్యామ్నాయం చూపకుండా సలహాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు.. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజలు సరైన సమయంలో బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు.