కాంగ్రెస్‌లో కలకలం.. రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి బిగ్ షాక్

by Anukaran |   ( Updated:2021-09-02 07:39:57.0  )
Komatireddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం అందిందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. వైఎస్‌ కుటుంబంతో తనకున్న అనుబంధం దృష్ట్యా వెళ్తున్నానని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం రాజకీయాలకు అతీతమన్నారు. కాగా ఆత్మీయ సమ్మేళనానికి ఎవరూ వెళ్లవద్దంటూ టీపీసీసీ నుంచి ప్రకటన విడుదలైన విషయం తెలిపిందే. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెళ్తానని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed