జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే: కోమటిరెడ్డి

by Shyam |
జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే: కోమటిరెడ్డి
X

దిశ, భువనగిరి: రైతుల‌కోసం అవ‌స‌ర‌మైతే జైలుకు వెళ‌తామ‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ర‌ద్దు చేయా లని రైతులకు మద్దతుగా జాతీయ కాంగ్రెస్ పిలుపుమేరకు చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయ‌కుంటే తెలంగాణ ఉద్య‌మ త‌ర‌హాలో రైతు ఉద్య‌మం చేప‌డుతామ‌ని హెచ్చరించారు. అసెంబ్లీ నుంచి రాజ్‌భ‌వ‌న్‌కు ర్యాలీగా బ‌య‌లు దేరిన కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అడ్డుకుని బ‌ల‌వంతంగా అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించడం నియంత పాలనను తలపిస్తోందన్నారు. రైతులకు న్యాయం జ‌రిగే వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ రైతుల ప‌క్షాన నిల‌బ‌డుతుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement

Next Story