మట్టిపదాల అల్లికగా ‘కోలుకోలమ్మా’

by Jakkula Samataha |   ( Updated:2024-07-02 14:45:23.0  )
Virataparvam
X

దిశ, సినిమా : వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. ఈ చిత్రం నుంచి వస్తున్న ఒక్కో అప్‌డేట్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తోంది. ఇక ఉమెన్స్ డే సందర్భంగా విడుదల చేసిన ‘వాయిస్ ఓవర్’కు అద్భుతమైన రెస్సాన్స్ రాగా, ఆ చిత్రం నుంచి విడుదలైన ‘కోలు కోల‌మ్మా కోలో’ సాంగ్ సినీ సంగీతాభిమానుల మనసు దోచుకుంటోంది. ఈ పాటను దివ్య మాలిక‌, సురేశ్ బొబ్బిలి ఎంతో లాలిత్యంతో పాడగా.. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.

కాగా ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం పల్లె పదాల్లోని మాధుర్యాన్ని పంచింది. తాజాగా విరాట‌ప‌ర్వం టీమ్ మెంబ‌ర్స్ ఈ సాంగ్ మేకింగ్ వీడియోను విడుద‌ల చేశారు. ఈ పాట ఎలా తెరపైకి వచ్చింది, ఈ పాట ఏ స్టైల్లో ఉండాలని డైరెక్టర్ కోరుకున్నారు, అందుకోసం చంద్రబోస్ ఎలా కష్టపడ్డాడు, ఎలాంటి పదాలను వెలికి తీశాడు వంటి ఆసక్తికరమైన విషయాలను.. డైరెక్టర్ వేణుఊడుగుల‌, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, పాట‌ల ర‌చయిత చంద్రబోస్ ప్రేక్షకుల‌తో పంచుకున్నారు. కాగా విరాట‌ప‌ర్వం వేస‌వి కానుకగా ఏప్రిల్ 30న థియేట‌ర్లలో రానుంది.

Click Here For Video Post..

Advertisement

Next Story