'21 డేస్" … కరోనా పై సినిమా

by Shyam |
21 డేస్ … కరోనా పై సినిమా
X

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తిప్పలు పెడుతుంది. క్షణ క్షణం భయంతో బతికేలా చేస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందగల ఈ వైరస్ ను అరికట్టేందుకు దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి. భారత్ లోనూ కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు దేశాన్ని ఎక్కడికక్కడ లాక్ డౌన్ చేసేసింది ప్రభుత్వం. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు 21 రోజులు. అయినా కరోనా ఉపద్రవం శాంతించక పోవడంతో మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ దేశ ప్రజలకు ప్రకటన చేశారు ప్రధాని మోడీ.

ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు , ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సినిమా తీస్తానని ప్రకటించారు కోలీవుడ్ నిర్మాత ఎం. విజయ్ భాస్కర్ రాజ్. 21 డేస్ పేరుతో సినిమాను తెరకెక్కిస్తామని తెలిపారు. కేవలం వైరస్ గురించే కాదు భావోద్వేగాల మిళితంగా సినిమా ఉంటుందన్నారు. మూడు గంటల నిడివితో సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నానని చెప్పిన ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్… ఈ సినిమా ద్వారా సొంత నిర్మాణ సంస్థలో తొలిసారి దర్శకులుగా మారబోతున్నారు. ఆలోచన వచ్చిన ఏడు రోజుల్లోనే పూర్తి స్క్రిప్ట్ రాసుకున్నట్లు చెప్పిన విజయ్ భాస్కర్… స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించనున్నారు. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Tags : Kollywood, 21 days, M.Vijay Bhaskar Raj, Corona, CoronaVirus, Covid19

Advertisement

Next Story

Most Viewed