కరోనాతో మరో ప్రముఖ కమెడియన్ మృతి

by Shyam |   ( Updated:2021-05-05 23:35:50.0  )
కరోనాతో మరో ప్రముఖ కమెడియన్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమను కరోనా వదిలిపెట్టడం లేదు. గతేడాది నుండి ఇప్పటివరకు చిత్ర ప్రముఖులు ఎంతోమంది కరోనా వలన మృతిచెందారు. తాజాగా మరో నటుడు కరోనా మహమ్మారికి బలయ్యాడు. కోలీవుడ్ నటుడు, ప్రముఖ కమెడియన్‌ పాండు(74) కరోనా కారణంగా కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన గురువారం ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పుటికే పాండు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దానికి తోడు కరోనా కూడా రావడంతో ఆయనను కాపాడలేకపోయామని డాక్టర్లు తెలిపారు. పాండు మృతికి పలువురు కోలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story