- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ నిర్ణయం సరైంది కాదు.. గంభీర్
దిశ, వెబ్డెస్క్: విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఈ సీజన్ తనకు చివరిదని తీసుకున్న నిర్ణయం సరైంది కాదని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2021 రెండో దశ ముగిసిన తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని చెబితే బాగుండేదని అన్నారు. స్టార్‌స్పోర్ట్స్‌తో గంభీర్మాట్లాడుతూ‘‘ కోహ్లి తీసుకున్న నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకు ఇది సరైన సమయం కాదు. ఈ ప్రకటన అనవసరంగా ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. కోహ్లీ ఈ సీజన్ తర్వాత కెప్టెన్‌గా ఉండడు కాబట్టి ఎలాగైనా కప్ గెలవాలనే ఆశయం వారిపై అధిక భారాన్ని మోపుతుంది. ఒకరి కోసం కాదు.. ఫ్రాంఛైజీ కోసం టైటిల్ గెలవాలి. ఈ విషయాన్ని కోహ్లి గుర్తుపెట్టుకుంటే ఈ సమయంలో ఈ ప్రకటన చేసేవాడు కాదు’’అని తప్పుబట్టాడు.
ఇటీవలే టీ 20 ప్రపంచకప్తర్వాత టీమిండియా టీ 20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కోహ్లి ఐపీఎల్ రెండో దశ సీజన్ ముగిసిన తర్వాత ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి కూడా వైదొలగుతానని ఆదివారం ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ విషయం ఆర్సీబీ అభిమానులను ఒకింత షాక్‌కు గురిచేసింది.
2013 లో పూర్తి స్థాయి బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన కోహ్లి ఒక్కసారి కూడా టైటిల్ గెలిపించలేకపోవడమే కారణమని తెలుస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈసారి ఆర్సీబీకి గెలిచే చాన్సులు ఎక్కువే ఉన్నాయని, ఇలాంటి సమయంలో కోహ్లి నుంచి ఈ ప్రకటన ఊహించలేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ జట్టు 2015 లో మూడో స్థానం, 2016 లో రన్నరప్, 2020 లో నాలుగో స్థానంలో నిలిచింది. నేడు అబుదాబిలో రెండో దశ మ్యాచ్ లో ఆర్సీబీ కోల్‌కతాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.