- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోహ్లీ కెప్టెన్సీ దుమారంపై కుండబద్దలు కొట్టిన BCCI బాస్
దిశ, వెబ్ డెస్క్: వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ ని నియమించినప్పటి నుండి జరుగుతున్న కెప్టెన్సీ చర్చపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. రెండు వైట్ బాల్ ఫార్మాట్‌లలో ఇద్దరు కెప్టెన్లు ఉండటం భారత జట్టుకు సరికాదని భావించినందుకే కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించి రోహిత్‌తో భర్తీ చేయాలనేదే సెలెక్టర్ల నిర్ణయమని గంగూలీ స్పష్టం చేశాడు.
బీసీసీఐ ప్రెసిడెంట్ కూడా తమ నిర్ణయాన్ని కోహ్లీకి తెలియజేశారు. అతను దానిని అంగీకరించాడని గంగూలీ తెలిపాడు. అయితే T20 కెప్టెన్‌గా కూడా వైదొలగవద్దని BCCI కోహ్లీని అభ్యర్థించింది. కాని UAEలో జరిగిన ప్రపంచ కప్ తర్వాత T20 ఫార్మాట్‌లో కెప్టెన్ గా కొనసాగడానికి అతను ఇష్టపడలేదని దాదా వెల్లడించాడు. ODI కెప్టెన్‌గా కోహ్లీ అత్యుత్తమ రికార్డు గురించి మాక్కూడా తెలుసు. కానీ రోహిత్ భారత్‌కి కెప్టెన్‌గా ఉన్న ఏ వన్డేలోనైనా అతని రికార్డును పరిశీలిస్తే, అది కూడా చాలా బాగుందని ఈ భారత మూజీ కెప్టెన్ తెలిపాడు.