డీఆర్ఎస్ తిరస్కరణపై కోహ్లీ ఫైర్

by Shyam |
డీఆర్ఎస్ తిరస్కరణపై కోహ్లీ ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో మాథ్యూ వేడ్ కోసం డీఆర్ఎస్ కోరితే అంపైర్లు తిరస్కరించడంపై టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాథ్యూ వేడ్ 50 పరుగుల వద్ద ఉన్నప్పుడు నటరాజన్ వేసిన బంతి అతడి ప్యాడ్లకు తగిలింది. నటరాజన్ సహా ఆటగాళ్లందరూ ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. కాగా, అంపైర్ వారి అప్పీల్ తిరస్కరించాడు. ఆ సమయంలో బౌండరీ వద్ద ఉన్న కెప్టెన్ కోహ్లీని సంప్రదించి 15 సెకెన్లలోపే డీఆర్ఎస్ తీసుకున్నాడు.

కాగా, అంపైర్ టీమ్ ఇండియా డీఆర్ఎస్‌ను తిరస్కరించాడు. కోహ్లీ డీఆర్ఎస్ తీసుకోవడానికి ముందే గ్రౌండ్‌లోని స్క్రీన్‌పై ఆ బంతికి సంబంధించిన రిప్లై వచ్చింది. దీంతో అంపైర్లు రివ్యూను తిరస్కరించారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘టీవీ ప్రొడక్షన్ వాళ్లు చేసిన తప్పుకు ఇండియా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలు డీఆర్ఎస్ తీసుకోకముందే బిగ్ స్క్రీన్‌పై రిప్లై ఎలా ప్రదర్శిస్తారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ పొరపాటు కారణంగా వేడ్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత మరో 38 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల తేడాతో ఓటమి చెందింది.

Advertisement

Next Story

Most Viewed