- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆత్మస్థైర్యంతో కరోనాను జయించా : ఎమ్మెల్యే సుధాకర్
దిశ, ఏపీ బ్యూరో: ఆత్మస్థైర్యంతోనే కరోనాను జయించానని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తెలిపారు. 21 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండి కరోనాను జయించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 25న తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. విషయం తెలిసాక తొలుత ఆందోళన చెందానని చెప్పారు. అయితే కుటుంబం, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు కళ్లముందు మెదలడంతో ధైర్యం తెచ్చుకునేవాడినని వివరించారు. ఆరంభంలో కరోనాను జయిస్తానా అన్న ప్రశ్న తలెత్తింది. కానీ, మంచి ఆహారం, ప్రాణాయామం, సరైన నిద్ర, డాక్టర్ల సూచనలు పాటించడం ద్వారా హోం క్వారంటైన్‌లోనే ఉండి వైరస్‌ను జయించానని తెలిపారు.
అంతేకాకుండా, స్పెషలిస్ట్ డాక్టర్ల నుంచి ఫోన్‌లో ఎప్పటికప్పుడు వైద్య సహాయం తీసుకున్నాని, ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానన్నారు. ప్రతి రోజూ ఉదయం నూనె లేకుండా టిఫిన్, రెండు గుడ్లు, అల్లం టీ, మధ్యాహ్నం చికెన్, అన్నం, సాయంత్రం తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్, నిమ్మకాయ నీళ్లు, రాత్రి అల్పాహారం, పసుపు, మిరియాలు కలిపిన పాలు తీసుకునే వాడినని గుర్తుచేశారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేడినీళ్లు ఆవిరి పట్టేవాడినని చెప్పారు. దాహం వేసిన ప్రతిసారీ వేడినీళ్లు మాత్రమే తాగేవాడినని ఆయన వెల్లడించారు. రోజూ శ్వాసకు సంబంధించిన 15 రకాల వ్యాయామాలు చేసేవాడినని చెప్పారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.