- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిత్యం వార్తల్లో నిలుస్తున్న ములకలపల్లి.. ఇక్కడి అడవుల్లో జోరుగా ఆ పని
దిశ, ములకలపల్లి: కోడి పందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగులకు కేరాఫ్ అడ్రస్ గా ములకలపల్లి నిలుస్తోంది. గతంలో ఎన్నడూలేనంతగా ఇటీవల ఈ మండలం పేరు జూదానికి చిరునామాగా ప్రాచుర్యం పొందింది. స్థానిక పోలీసుల ఉదాసీనతతో జూదం నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అడ్డూ అదుపులేకుండా ఎక్కడపడితే అక్కడ కోడి పందాలు, పేకాట నిర్వహిస్తుండటంతో నిత్యం మండలం పేరు వార్తల్లో నిలుస్తోంది. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేసి కేసులు నమోదు చేస్తుండటంతో లోకల్ పోలీసులకు ఇబ్బందిగా మారింది. జూదం బురద స్థానిక పోలీసులకు అంటక తప్పడంలేదు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ కోడిపందాలు, పేకాట స్థావరాలపై దాడులు చేసినప్పుడల్లా పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు, పేకాట ఆడుతున్నవారు పట్టుపడుతున్నారు.
సరిహద్దుల్లో స్థావరాలు.. పోలీసుల కదలికలపై నిఘా
ములకలపల్లి మండలం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ అంతర్ రాష్ట్ర సరిహద్దు కావడం, రెండు రాష్ట్రాల సరిహద్దు అంతా పూర్తిగా అడవి కావడంతో జూదాల నిర్వాహకులకు కలిసొస్తుంది. మండలంలోని సుందర్ నగర్ మొదలుకొని గుండాలపడు వరకు సుమారు 20 కిలోమీటర్ల వరకు ఈ సరిహద్దు ప్రాంతం ఉంటుంది. దీంతో సరిహద్దు ప్రాంతం పూర్తిగా జూదాలకు అడ్డాగా మారిపోయింది. కోడిపందాలు, పేకాట నిర్వాహకులు ఈ అడవుల్లో స్థావరాలు మార్చుతుంటారు. పేకాట నిర్వాహకులు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటారని తెలుస్తోంది. పేకాట నిర్వహించే ప్రదేశానికి వెళ్లే దారుల్లో సమాచారం కోసం వాళ్ల మనుషుల్ని ఏర్పాటు చేసి పోలీసుల కదలికలపై నిఘా ఉంచుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నిర్వాహకులపై చర్యలేవి…?
నిత్యం కోడిపందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్ లు మండలంలో జోరుగా సాగుతున్నాయి. వీటి మూలంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా ఛిద్రమై పోతున్నాయి. ఇటీవల పోయిన నెల మంగలిగుట్ట అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడిపందాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేసి 46 బైక్ లు, 15 కోడిపుంజులు, 3 సెల్ ఫోన్లు, ఆరుగురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి రూ.14970 నగదును స్వాధీనం చేసుకున్నారు. నెల తిరక్కుండానే అదే ప్రాంతంలో జీడితోటలో పెద్ద మొత్తంలో పేకాట నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడిచేసి అరెస్టు చేసిన 19 మంది నుంచి రూ. 1,10,320 నగదు, 14 సెల్ ఫోన్స్, 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అనేకమంది పరారైనట్లు సమాచారం. ఇందులో అసలు నిర్వాహకులు ముగ్గురు పరారీలో ఉన్నారు. దాడిచేసిన ప్రతి సారి ఈ జూదంలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టి వదిలేయడం మూలంగా ఎలాంటి ఉపయోగం ఉండటంలేదు. అసలు ఈ జూదం నిర్వహిస్తున్నవారిని, వాటిని ప్రోత్సహిస్తున్నవారిని, వీరి వెనక ఉన్న పెద్దమనుషుల్ని గుర్తించి కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటివి నియంత్రణలోకి వస్తాయన్న అభిప్రాయం జనంలో వ్యక్తం అవుతోంది.
- Tags
- kodi pandalu