పోలీసులు అడ్డుపడడం సిగ్గుచేటు: కోదండరాం

by Shyam |
పోలీసులు అడ్డుపడడం సిగ్గుచేటు: కోదండరాం
X

దిశ, గజ్వేల్: దళితుల పట్ల ప్రభుత్వం తన వైఖరిని విడనడాలని, దళితులపై దాడులు, భూమి గుంచుకోవడం వంటి చర్యలను మానుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొపెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన నర్సింహులు కుటుంబీకులను ఆయన పరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందని మండిపడ్డారు. బెదిరించి తీసుకోవడం సమంజసం కాదని, దళితులకు మూడెకరాల భూమి ఇయ్యకపోగా ఉన్నది గుంజుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. భూమికి భూమి ఇయ్యమని నర్సింహులు వేడుకున్నా వినకుండా భూమిని లాక్కోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన అంత్యక్రియలకు కూడా పోలీసులు అడ్డుపడడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఇలా మీద పడి గుంజుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. నర్సింహులు కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed