- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతులను సంక్షోభంలోకి నెడుతున్నారు: కోదండరాం
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెస్తున్న మార్పులు, వెల్లడిస్తున్న విధానాలు వ్యవసాయ కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టే విధంగా ఉన్నాయని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని జనసమితి ఆఫీస్‌లో కోదండరాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, జీవీ రామాంజనేయులు, కన్నెగంటి రవి, అచ్యుత రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించకుండానే కేవలం అధికారులు, శాస్త్రవేత్తలు, రైతుబంధు కమిటీ సభ్యులతో మాట్లాడి విధానాలు అమలు చేయడం సరికాదన్నారు. పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని, వ్యాపారులు మద్ధతు ధరలకే ధాన్యం కొనుగోలు చేసేలా నిబంధనలు రూపొందించాలని కోదండరాం అన్నారు. సమావేశంలో కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వాస్తవసాగుదారులను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పత్తి, వరి పంటల సాగులో పెద్ద సంఖ్యలో కౌలు రైతులు ఉన్నారన్నారు. పోడు రైతుల వ్యవసాయానికి ప్రభుత్వం సాయం అందించడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సాగు భూముల భూసారం, వర్షపాతం, సహజ వనరులను దృష్టిలో ఉంచుకొని పంటల విధానాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.