- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నారా లోకేశ్‌కు కొడాలి నాని వార్నింగ్
దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హత్యా రాజకీయాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రప్రజలను పట్టించుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లు ఇంటికే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. అప్పుడప్పుడు జూమ్‌తో టైంపాస్ చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులకు 21 రోజుల్లోపు ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రైతులకు చంద్రబాబు పెట్టిన రూ. 4 వేల కోట్లు బకాయిలు చెల్లించామని వెల్లడించారు. చంద్రబాబు లేఖ రాసే సమయానికే రూ.1600 కోట్లు చెల్లించామన్నారు. కేంద్రం ఇవ్వకపోయినా రైతులకు డబ్బు సకాలంలో చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకు భయమని విమర్శించారు. దమ్ముంటే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని సవాల్ విసిరారు. ఊకకి, ధాన్యానికి తేడా తెలియని వ్యక్తి చంద్రబాబు అని, లోకేష్‌ను అచ్చోసిన ఆంబోతులా వదిలారంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలను మట్టుబెట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలను తమ ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని మంత్రి కొడాలి నాని హితవు పలికారు.