చంద్రబాబుకు కొడాలి నాని హెచ్చరిక

by srinivas |
Minister Kodali Nani
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీమంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. చంద్రబాబు పెద్ద అవినీతి చక్రవర్తి అంటూ ధ్వజమెత్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్‌ను మంగళగిరిలో ఓడించారనే అక్కసుతో చంద్రబాబు ప్రజలను బూతులు తిడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని నాని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రానికి అప్పుతెచ్చి పెట్టి.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎన్టీఆర్‌, వైఎస్‌ పరిపాలనకు సీఎం జగన్‌ వారసుడని మంత్రి నాని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉందంటూ ఎద్దేవా చేశారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలలో చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ సైతం కాపాడలేక పోయారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed