ఆంధ్ర వ్యాపారిని అదుపులోకి తీసుకున్న కోదాడ పోలీసులు

by Shyam |   ( Updated:2021-12-22 09:17:25.0  )
Rice trader arrest
X

దిశ, కోదాడ : అర్ధరాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆంధ్ర వ్యాపారిని కోదాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున రామాపురం క్రాస్ రోడ్‌లో తనిఖీలు చేపట్టిన కోదాడ రూరల్ పోలీసులకు ఆ వ్యాపారి బియ్యంతో సహ పట్టుబడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్ఐ సాయి ప్రశాంత్ వెల్లడించారు.

కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామాపురం క్రాస్ రోడ్‌లో బుధవారం తెల్లవారుజామున చేపట్టిన తనిఖీల్లో ఏపీ నుంచి వస్తున్న ఆటోను ఆపి తనిఖీలు చేశారు. దానిలో నాలుగు టన్నుల రేషన్ బియ్యం ఉండటంతో అందులోని వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. సదరు వ్యక్తి కృష్ణ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చావ పిచ్చయ్యగా పేర్కొన్నాడు. రేషన్ బియ్యం కొనుగోలు చేసి అక్రమ విక్రయాలు చేపడుతున్నట్లు విచారణలో తేలింది. వెంటనే బియ్యాన్ని సీజ్ చేయడంతోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. కాగా, తెల్లవారు జామున బియ్యాన్ని పట్టుకున్నా.. రాత్రి వరకు పోలీసులు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. దీనిలో కోదాడకు చెందిన ఓ ముగ్గురి బియ్యం వ్యాపారుల హస్తం కూడా ఉన్నట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed