‘టీమిండియా తర్వాతి కెప్టెన్ కేఎల్ రాహుల్’

by Shyam |   ( Updated:2020-09-14 07:57:21.0  )
‘టీమిండియా తర్వాతి కెప్టెన్ కేఎల్ రాహుల్’
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టును ధోనీ తర్వాత విరాట్ కొహ్లీ విజయవంతంగా నడిపిస్తున్నారు. ఐసీసీ టైటిల్స్ గెలవలేదనే ఒకే ఒక లోటు తప్ప… విరాట్ కెప్టెన్సీ విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. విరాట్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు పగ్గాలు చేపడుతున్నారు. ఒక వేళ కొహ్లీ కెప్టెన్సీని వదులుకున్నా, ఆట నుంచి నిష్క్రమించినా తర్వాతి కెప్టెన్ రోహితే అని అందరూ అనుకుంటున్నారు. అయితే ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. విరాట్ కొహ్లీ తర్వాత కేఎల్ రాహుల్ భారత జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని అంటున్నాడు.

ఫేస్‌బుక్‌లో అభిమానులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఈ సీజన్‌లో ఎలా రాణిస్తాడనే దానిపై అతడి భవిష్యత్ ఆధారపడి ఉందన్నాడు. ఐపీఎల్‌లో రాహుల్ తప్పకుండా అంచనాలను మించి రాణిస్తాడని చోప్రా చెప్పాడు. భవిష్యత్‌లో భారత జట్టు కెప్టెన్‌గా అతడిని మనం చూడొచ్చని అన్నాడు. కొహ్లీ, రోహిత్‌లు ఇద్దరూ సమాన వయస్సు కలవారు. వాళ్లు ఒక స్థాయికి వచ్చాక భారత జట్టులో ఉన్నా.. కెప్టెన్లుగా మాత్రం ఉండరు. వారి స్థానంలో మనం కేఎల్ రాహుల్‌ని చూడవచ్చని చోప్రా అన్నారు. ఇప్పటివరకూ రాహుల్ ఆటను, వ్యవహారశైలిని గమనిస్తే.. తప్పకుండా మంచి కెప్టెన్ అవుతాడనే నమ్మకం ఉందని చెప్పాడు.

Read Also..

యూఎస్ ఓపెన్ విజేత థీమ్


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed