- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏసీబీ వలలో అవి"నీటి" అధికారి..

దిశ, పటాన్ చెరు : పటాన్ చెరు నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ పరిధిలో గుమ్మడిదల ఏఈగా పనిచేస్తున్న రవి కిషోర్ ఏసీబీకి చిక్కాడు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఇరిగేషన్ ఎన్వోసీ పొందేందుకు సంతోష్ అనే వ్యక్తి ఏఈఈ రవి కిషోర్ ను సంప్రదించాడు. అయితే నిరభ్యంతర పత్రం జారీ చేసేందుకు గాను ఆ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు సంతోష్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ అవినీతి అధికారి ఆట కట్టించడానికి పక్కా స్కెచ్ వేశారు. బాధితుడు సంతోష్ ను పంపించి పటాన్ చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈఈ రవి కిషోర్ కి రూ.లక్ష నగదును లంచంగా ఇప్పించారు. బాధితుడు లంచమిస్తుండగా సదురు అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కార్యాలయం పై దాడి చేయడంతో మిగతా అధికారులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తుంది. ఏఈ రవి కిషోర్ నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.