- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూఎస్ ఓపెన్ విజేత థీమ్
<p>దిశ, స్పోర్ట్స్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను డొమినిక్ థీమ్ గెలిచాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన హోరాహోరీ పోరులో స్వెరెవ్పై థీమ్ అద్భుత విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినా… మొక్కవోని దీక్షతో మిగిలిన మూడు సెట్లు గెలిచి తన జీవితంలో తొలి గ్రాండ్స్లామ్ నెగ్గాడు. జ్వెరెవ్పై 2-6, 4-6, 6-4, 6-3, 7-6 తేడాతో గెలుపొందాడు. ఒక ఆస్ట్రియా టెన్నిస్ ప్లేయర్ యూఎస్ ఓపెన్ గెలవడం ఇదే తొలిసారి. […]</p>

దిశ, స్పోర్ట్స్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను డొమినిక్ థీమ్ గెలిచాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన హోరాహోరీ పోరులో స్వెరెవ్పై థీమ్ అద్భుత విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినా… మొక్కవోని దీక్షతో మిగిలిన మూడు సెట్లు గెలిచి తన జీవితంలో తొలి గ్రాండ్స్లామ్ నెగ్గాడు. జ్వెరెవ్పై 2-6, 4-6, 6-4, 6-3, 7-6 తేడాతో గెలుపొందాడు. ఒక ఆస్ట్రియా టెన్నిస్ ప్లేయర్ యూఎస్ ఓపెన్ గెలవడం ఇదే తొలిసారి.
అంతేగాకుండా 90వ దశకంలో పుట్టి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన రికార్డును కూడా థీమ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్కు చేరుకున్న థీమ్ జకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. యూఎస్ ఓపెన్ ఫేవరెట్గా అందరూ జకోవిచ్నే భావించారు. కానీ నాలుగో రౌండ్లో అనూహ్యంగా డిస్ క్వాలిఫై కావడంతో అందరి దృష్టి థీమ్పై పడింది. అందరి అంచనాలను అందుకుంటూ ఎట్టకేలకు థీమ్ యూఎస్ టైటిల్ గెలుచుకున్నాడు. తొలి రెండు సెట్లలో వెనుకబడిన ఆటగాడు యూఎస్ ఓపెన్ నెగ్గడం చరిత్రలో ఇదే తొలిసారి.
Read Also…






