- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Rare snake: యూపీలో అరుదైన పాము.. దేశంలో కేవలం రెండుసార్లే ప్రత్యేక్షం

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో వేలాది రకాల పాము జాతులున్నాయి. వాటిలో కొన్ని విషపూరితం కాగా, మరికొన్ని విషం లేనివి ఉన్నాయి. ఇక వీటిల్లో అరుదైన జాతులకు చెందిన పాములు (Rare snakes) అప్పుడప్పుడు మాత్రమే దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలో వీటిని రక్షించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటాయి. అయితే, తాజాగా యూపీలో (Uttarpradesh) ఓ అరుదైన పాము దర్శనమిచ్చింది. అంతేకాదు, ఈ పాము ఇప్పటివరకు మన దేశంలో కేవలం రెండుసార్లు మాత్రమే కనిపించినట్లు అటవీ అధికారులు తెలిపారు.
యూపీలోని దుధ్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ( Dudhwa Tiger Reserve Forest) పాలియా ఖేరీ ప్రాంతంలో మార్చి 28న అటవీ శాఖ సిబ్బంది రైనోలను విడుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో వాటి భద్రత కోసం ఓ చీమల పుట్టను తొలగిస్తుండగా పొడవాటి ముక్కు గల ఆకర్షణీయమైన ఆకుపచ్చని అరుదైన పామును (Ahaetulla longirostris) గుర్తించారు. గతేడాది బీహార్‌లో ఒక్కసారి మాత్రమే ఈ పాము కనిపించినట్లు వారు తెలిపారు. ఈ జాతి పాములు సాధారణంగా ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పామును జాగ్రత్తగా సంరక్షించి, సమీపంలోని మరో చీమల పుట్టలో వదిలేసినట్లు చెప్పారు.