- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Tenth Results: టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఫలితాలు విడుదల

దిశ,వెబ్ డెస్క్: పదవ తరగతి (TG SSC) పరీక్ష ఫలితాలు (Results) ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా? అని విద్యార్థులు, వారి పేరెంట్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలకు తెలంగాణ విద్యాశాఖ ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫలితాలను అధికారిక వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇక ఈసారి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడ్స్‌తో పాటు గతంలో మాదిరి మార్కులను ఇవ్వనున్నారు. అలాగే, మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రకటించనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈఏడాది రాత పరీక్షలు 80 మార్కులకు, ఇంటర్నల్ మార్కులు 20 మార్కులను నిర్వహించారు. ఈ మేరకు మార్కుల మెమోలను జారీ చేస్తారు. అలాగే వచ్చే ఏడాది నుంచి టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులను కూడా తొలగించి, మొత్తం 6 సబ్జెక్టులకు 100 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.