శ్రీరామనవమి రోజు ఈ చిన్నపని చేస్తే.. మీకు త్వరలో పెళ్లి ఖాయం

by Naveena |
శ్రీరామనవమి రోజు ఈ చిన్నపని చేస్తే.. మీకు త్వరలో పెళ్లి ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్ : చైత్ర మాసం శుక్ల పక్షం నవమి తిధిని హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజున శ్రీ రాముడి జన్మదినోత్సవం జరుపుకుంటారు.అంటే ఆ రోజు సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. వీరు ఆదర్శ దంపతులు. ప్రధాన ఆలయాలతోపాటు ఊరువాడా సీతారాముల కల్యాణం జరుపుతారు. పురాణాల ప్రకారం ఈ రోజున రాముడు అయోధ్య రాజు దశరథుడు, కౌసల్యకి జన్మించాడు. ప్రతి ఏడాది మన దేశంలో సీతారాముల కళ్యాణం జరుపుతాం. అయితే ఆరోజు చిన్న పరిహారం చేయడం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి అప్లైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు పెళ్లి కాని వారికి కూడా పెళ్లి ఖాయం అవుతుంది.

శ్రీరామనవమి ఏప్రిల్ 6 ఆదివారం రోజు నిర్వహిస్తున్నారు. దీనికి శుభసమయం అంటే నవమి తిథి ఏప్రిల్ 5 సాయంత్రం 7 : 26 నిమిషాల నుంచి మరుసటి రోజు ఏప్రిల్ 6 సాయంత్రం 7:22 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో సీతారాముల వివాహం జరిపిస్తారు. అయితే శ్రీరామ నవమి రోజు ఉదయం నిద్ర లేచి, స్నానం చేసి పూజలు వంటివి చేయాలి. సీతారామ లక్ష్మణంతో పాటు హనుమంతుని విగ్రహాలకు మంచి అభిషేకం చేసి అలంకరిస్తారు. ఆరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పాటించడం ఆనవాయితీ. అంతేకాదు శ్రీరామనవమి రోజు పాణకం ప్రసాదంగా ఇస్తారు. ఇక పెళ్లి కాని వారు శ్రీరామనవమి రోజు ఒక చిన్న పని చేయాలి. వివాహం ఆలస్యమైన వారు సీతమ్మ తల్లికి పసుపు, కుంకుమ, గంధం సమర్పిస్తే వారికి త్వరలో పెళ్లి ఖాయం అవుతుంది. ఇలా చేయటం వల్ల సంపద, శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ఎందుకంటే సీతమ్మ.. లక్ష్మీ ప్రతిరూపమని అంటారు. అంతేకాదు హనుమాన్ దేవాలయాలకు వెళ్లి హనుమాన్ చాలీసా కూడా పాటించడం ఎంతో మంచిదని అంటున్నారు.

Next Story

Most Viewed