రియాల్టీ స్టోరీలో సూర్యతో జతకట్టబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వావ్, సూపర్ కాంబో అంటున్న నెటిజన్లు

by Hamsa |
రియాల్టీ స్టోరీలో సూర్యతో జతకట్టబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వావ్, సూపర్ కాంబో అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) గత ఏడాది ‘కంగువ’ సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘రెట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మే1న థియేటర్స్‌లోకి రాబోతుంది.ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో పాటు సూర్య, వెంకీ అట్లూరి(Venky Atluri) కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే రియాల్టీ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉంటే... తాజాగా, ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో సూర్య సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనున్నట్లు టాక్. ఇక మారుతీ కార్లకు సంబంధించిన నేపథ్య కథాంశంతో తెరకెక్కించిన బయోపిక్‌గా రాబోతున్న ఈ చిత్రానికి ‘796CC’టైటిల్ పెట్టాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్, సూపర్ కాంబో అని అంటున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో ఇది వరకే ‘గ్యాంగ్’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇది రెండో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.



Next Story

Most Viewed