Dhanush: ధనుష్ ‘ఇడ్లీ కడై’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

by sudharani |
Dhanush: ధనుష్ ‘ఇడ్లీ కడై’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’ (Idli Kadai). డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అకాశ్ భాస్కర్ (Akash Bhaskar) నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్య మీనన్ హీరోయిన్ కాగా.. సత్యరాజ్, రాజ్ కిరణ్, ప్రకాశ్ రాజ్, షాలినీ పాండే తరితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ (First look posters), అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య ‘ఇడ్లీ కడై’ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.

కానీ, గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టు సోషల్ మీడియా(Social media)లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వార్తలను పట్టించుకోవద్దు అని అనుకున్న టైమ్‌కే ఇడ్లీకడై మూవీ మీ ముందుకు వస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూ(Interview)లో పాల్గొన్న చిత్ర బృందం చెప్పుకొచ్చింది. కానీ, అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ మేరకు సినిమా కొత్త విడుదల తేదీ(New release date)ని అనౌన్స్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చాడు ధనుష్. అక్టోబర్ 01న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed