- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL : జాక్‌పాట్.. ఆ టీమ్‌కు కెప్టెన్‌గా రాహుల్.. 25న అధికారిక ప్రకటన!
దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్.. ఐపీఎల్‌లో కొత్త జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. కొత్త ఫ్రాంచైజీ లక్నో.. రాహుల్‌కు భారీ ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా రూ. 20 కోట్లు ముట్టజెబుతున్నట్టు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
మరోవైపు SRH మాజీ ప్లేయర్ రషీద్ ఖాన్‌కు కూడా లక్నో ఫ్రాంచైజీ భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. రషీద్ ఖాన్‌కు రూ.16 కోట్లు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ తమ జట్టుకు చెందిన ఆటగాళ్లకు భారీ ఆఫర్ ఇస్తూ వారిని మభ్యపెడుతోందంటూ పంజాబ్, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలు బీసీసీఐకు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో లక్నో ఫ్రాంచైజీ వ్యవహారంపై ఫోకస్ పెట్టినట్టు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
అయితే డిసెంబరు 25లోగా కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి.. కెప్టెన్, కోచ్, టైటిల్ స్పాన్సర్‌లను ప్రకటించాలని ఇది వరకే బీసీసీఐ గడువు ఇచ్చింది. కాగా, 2022 ఐపీఎల్ సీజన్‌లో ఈ సారి 10 జట్లు పోటీపడనున్నాయి. లక్నో, అహ్మదాబాద్జట్లు తొలిసారిగా ఐపీఎల్బరిలోకి దిగనున్నాయి.
ఇదిలా ఉండగా లక్నో జట్టుకు హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ నియమితులయ్యాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన ఆండీ.. 2022 సీజన్‌కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ క్రమంలో ఆండీ ఫ్లవర్ హర్షం వ్యక్తం చేశాడు.