తెలంగాణలో భారీ పెట్టుబడికి ‘కిటెక్స్’ సుముఖత

by Shyam |
తెలంగాణలో భారీ పెట్టుబడికి ‘కిటెక్స్’ సుముఖత
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. రూ.1000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో కిటెక్స్ కంపెనీ రాష్ట్రంలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తంచేసింది.

కేరళ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కిటెక్స్ కంపెనీ.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో వెయ్యి కోట్ల భాగస్వామ్యం నెలకొల్పేందుకు సిద్ధపడింది. ఈ మేరకు శుక్రవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కంపెనీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు.

Advertisement

Next Story