- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా టెస్టుల్లో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… ఐదు రాష్ట్రాల్లో కరోనా టెస్ట్‌లు పెంచాలని ప్రధాని చెప్పారని, ఈ 5రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనాపై మరింత చురుకుగా, తగిన స్థాయిలో పనిచేయాలని, ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలంటూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ… ప్రభుత్వంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసినవి సూచనలే తప్ప విమర్శలు కాదనీ, ఆమె ఒక డాక్టర్ కాబట్టి ప్రభుత్వానికి కొన్ని విషయాలను తెలియజేసే ప్రయత్నం చేశారన్నారు. గవర్నర్ వ్యాఖ్యలతో బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆమె చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.