- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవన్నీ తప్పుడు లెక్కలే.. సీఎం కేసీఆర్‌పై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండు రోజులుగా వరుస ప్రెస్‌మీట్లతో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులను సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారన్నారు. తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, ధాన్యం సేకరణ కోసం కేంద్రం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు తెలుగు రాష్ట్రాల్లో.. 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తుందని వెల్లడించారు.
అంతేకాకుండా, కేవలం తెలంగాణలోనే 2014లో 43 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే, ప్రస్తుతం 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నామన్నారు. ధాన్యం సేకరణకు కేంద్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందని, గన్నీ సంచులకు కూడా కేంద్రమే డబ్బులిస్తోందన్నారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయడం లేదన్నారు. అసలు రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం సరిగా అంచన వేయకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో దాదాపు 108 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని కంటి చూపుతో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి కేంద్రానికి లేఖ రాశారన్నారు. సర్వే చేయకుండా బాధ్యతారహితంగా లేఖ రాయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 41 లక్షల మెట్రిక్ టన్నులకే ఒప్పందం చేసుకొని ఇప్పుడేమో 108 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలంటున్నారని ఆరోపించారు.