కిరణ్ ఖేర్‌కు బ్లడ్ కేన్సర్.. కన్ఫర్మ్ చేసిన భర్త

by Shyam |
Kirron Kher
X

దిశ, సినిమా: త‌న స‌తీమ‌ణి కిర‌ణ్ ఖేర్‌ బ్లడ్ కేన్సర్‌తో పోరాడుతున్నట్లు వెటరన్ యాక్టర్ అనుప‌మ్ ఖేర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. టెలివిజన్ యాక్ట్రెస్, సింగర్‌గానే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూసర్‌గా సత్తా చాటిన కిర‌ణ్ ఖేర్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చండీగఢ్ బీజేపీ ఎంపీగా పని‌చేస్తున్న ఆమె.. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తుండగా వాటిపై అనుపమ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న కిరణ్ చికిత్స తీసుకుంటోందని, త్వరలోనే ఇంతకు ముందరికన్నా మరింత స్ట్రాంగ్‌గా మనముందుకు వస్తుందని పేర్కొన్నారు. యాక్టివ్ స్పోక్ పర్సన్‌గా పార్టీలో చురుకుగా ఉండే కిరణ్ ఖేర్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తుందని, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటుందని చండీగఢ్ బీజేపీ ప్రెసిడెంట్ అరుణ్ సూద్ తెలిపారు. కిరణ్‌ను ప్రేమించేవారు చాలామంది ఉన్నారని, వారి ప్రార్థనలతో ఆమె కోలుకుంటున్నదని.. వారి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు అరుణ్, అనుపమ్.

Advertisement

Next Story

Most Viewed