- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ కోసం గంగూలీ వెంట 10 రోజులు పడ్డాను : మోరే
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాలోకి ధోనీని తీసుకొని వచ్చింది సౌరవ్ గంగూలీ అని అందరూ భావిస్తారు. కానీ ధోనీ జాతీయ జట్టులోకి రావడానికి అసలు కారకుడు అప్పటి సెలెక్టర్ కిరణ్ మోరే. అసలు ధోనీని తాను ఎలా కలిశాడో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియాకు వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో అతడిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు గుర్తించాము. టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఉంటూ కీపింగ్ చేయడం అతడికి భారంగా మారింది. అందుకే ఒక వికెట్ కీపర్.. 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్ చేయగలిగే క్రికెటర్ కోసం వెతుకుతున్నాను. అప్పుడు నాకు ఒక మ్యాచ్ సందర్భంగా ధోనీ కలిశాడు. ఆ మ్యాచ్‌లో ధోని 130 పరుగులు చేశాడు.
జట్టు మొత్తం కలిపి చేసిన పరుగులు 170. దాంతో ధోనీ టాలెంట్ తెలిసింది. వెంటనే అతడిని ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్ మ్యాచ్‌కు తీసుకోవాలని కెప్టెన్ గంగూలీపై ఒత్తిడి తెచ్చాడు. కానీ అప్పటికే జట్టులో ఉన్న కీపర్ దీప్ దాస్ గుప్తాను తీసి ధోనీని పెట్టుకోలేనని చెప్పాడు. అయినా సరే వదలకుండా 10 రోజుల పాటు గంగూలీ వెంటపడి బతిమిలాడాను. చివరకు అతడు ఒప్పుకున్నాడు.’ అని మోరే చెప్పాడు. ఆ తర్వాత ధోనీ టాలెంట్‌పై గంగూలీకి కూడా నమ్మకం కుదిరింది. అందుకే భారత జట్టులోకి వచ్చిన తర్వాత విఫలమైనా వరుసగా అవకాశాలు ఇచ్చాడు అని మోరే చెప్పుకొచ్చాడు.