కరోనా మహమ్మారి కమ్మేసిన వేళ… పోలీస్ ల ఔదార్యం

by Shamantha N |
కరోనా మహమ్మారి కమ్మేసిన వేళ…  పోలీస్ ల ఔదార్యం
X

దిశ వెబ్ డెస్క్: చైనా వాల్ దాటి ప్రపంచ దేశాల్లో అడుగుపెట్టిన కరోనా.. మన దేశాన్ని తాకింది. దాంతో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ విపత్తు సమయంలో తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టి .. డాక్టర్లు, పోలీసులు, సఫాయి కార్మికులు.. ఇతర రంగాల వాళ్లు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నిబంధనలు ఉల్లంఘించన వారిపై పోలీసులు లాఠీలు ఝలిపించారు. అది కూడా మన మంచికే. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కూడా కల్పించారు ట్రాఫిక్ పోలీసులు. బయటకు రావొద్దు అంటూ.. ప్రజలను వేడుకుంటున్నారు. రోడ్లపై నివసించే వారికి ఆహర ప్యాకెట్లు అందిస్తూ తమ సహృదయాన్ని చాటుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఓ పోలీసు కొడుకు.. తన తండ్రి గురించి ఎలా ఆవేదన పడుతున్నాడు? పోలీసుల తీరుపై వర్మ ఏం అన్నాడు? ఆ విషయాలు తెలుసుకుందాం.

పోలీసులు మనషులే. వారికి మనసుంటుంది. వారికి కుటుంబాలుంటాయి. ప్రజలంతా రోడ్లపైకి రాకుండా ఇల్లకే పరిమితమై ప్రాణాలు నిలుపుకోవాలని పదే పదే విన్నవించుకుంటున్న ప్రజలు వినట్లేదు. దాంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. దాంతో యువత రోడ్లపైకి రావడానికే భయపడుతున్నారు. కానీ ఇంకో యాంగిల్ లో పోలీసులు అలా కొడుతుంటే.. వారికి మనసే లేదని అనుకుంటాం. కానీ, వారు మానసికంగా ఎంత భాదపడతారో మనకు తెలియదు కదా. అందరూ ఇల్లకే పరిమితమై తమ కుటుంబాలతో ఉంటే… అందరికీ దూరంగా.. తన ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తూ.. మన దేశ, రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే.. ఓ పోలీసు కొడుకు… తన తండ్రిని విధులకు వెళ్లొందంటూ.. బయట కరోనా ఉందంటూ.. చెబుతూ… ఆ బాబు ఏడ్చే వీడియో నెటిజన్లతో కన్నీరు పెట్టిస్తోంది.

వీడియోలో ఏముందంటే..

ముంబయిలోని ఓ పోలీస్ కానిస్టేబుల్ విధులకు హాజరయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, అతడి కొడుకు తన తండ్రి ఇంట్లోనే తనతోపాటే ఉండాలని కోరుకుంటూ ఏడ్వడం చూస్తే గుండె బరువెక్కుతుంది. ‘‘నాన్న ఇంట్లోనే ఉండు. బయట కరోనా ఉంది వెళ్లొద్దు’’ అంటూ ఏడుస్తున్న ఆ పిల్లాడిని తండ్రి ఎత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అయినా .. ఆ పిల్లోడు ఏడుస్తూనే ఉంటాడు.

బయటకు వెళ్లేప్పుడు ఒకసారి ఆలోచించండి. మన కోసం వైద్యులు, పోలీసులు, అధికారులు ఎంతోమంది శ్రమిస్తున్నారు. వారిపై గౌరవం ఉంటే ఇంట్లోనే ఉండి సహకరించండి.

బయటకు రావొద్దంటూ బతిమాలుతున్న పోలీస్:

‘‘మీకోసం మా ప్రాణాలకు తెగించి రోడ్డు మీదికి వచ్చి డ్యూటీ చేస్తున్నాం.. దయచేసి మీరు రోడ్లపైకి రావొద్దు.. దయచేసి ఇంటికి వెళ్లిపో.. ప్రాణాలను రక్షించుకో.. నిన్ను నువ్వు కాపాడుకోవడమే కాదు.. నీ చుట్టూ ఉన్నవాళ్లని.. ఈ దేశాన్ని కాపాడు అంటూ ప్రాధేయపడుతూ’ ఓ ట్రాఫిక్ పోలీస్ వాహనదారుడికి దండం పెడుతూ.. కన్నీటి పర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోపై రామ్ గోపాల్ వర్మ కామెంట్

పోలీస్ వీడియోపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ పోలీసులకు చక్కని సలహా ఇచ్చారు. ‘నేను పోలీసులకు ఇచ్చే సలహా ఏంటి అంటే.. మీరు ప్రజల దగ్గర ప్రాధేయపడుతూ వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్లు మీ నెత్తి ఎక్కి కూర్చుంటారు’అంటూ ట్వీట్ చేశాడు.

పోలీసులకు అందరిలానే కుటుంబం ఉంటుంది. అయినప్పటికీ విపత్తు సమయంలో మనందరి క్షేమం కోసం.. పోలీసులంతా.. పహారా కాస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రోడ్లపై తినకుండా ఉంటున్నవారికి ఆహార ప్యాకెట్లు కూడా అందిస్తూ .. తమ సహృదయాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్పినట్లు ఏప్రిల్ 14 వరకు ఇల్లకే పరిమితం అవుదాం. ఆ తర్వాత కూడా పరిస్థితి బాగా లేకపోతే,.. మరిన్ని రోజులు ఇంట్లోనే గడుపుదాం. మన కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరి కోసం .. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. వారికి సహకరిద్దాం.

Tags : police, coronavirus, good heart, service, ram gopal varma, lock down

Advertisement

Next Story