ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌కు అబార్షన్ చేయించిన హీరో

by Shyam |
kim-space1
X

దిశ, సినిమా: కొరియన్ డ్రామా ‘ఛ ఛ ఛ’ ఫేమ్ కిమ్ సియోన్-హో‌పై సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. తన ఎక్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూనే అబార్షన్ చేసుకోవాలని ఫోర్స్ చేశాడనే పోస్ట్ ఈ మధ్య ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. కాగా, తాజాగా దీనిపై స్పందించిన కిమ్… ఈ విషయంలో తన మాజీ ప్రియురాలికి క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నానని, తనను పర్సనల్‌గా కలిసే సమయం కోసం వెయిట్ చేస్తున్నానని తెలిపాడు. అంతేకాదు తనకు సపోర్ట్ చేసి స్టార్‌గా నిలబెట్టిన అభిమానులకు కూడా సారీ, థాంక్స్ చెప్పాడు కిమ్. అజాగ్రత్త, అనాలోచిత చర్యలతో తనను చాలా బాధపెట్టానన్న ఆయన.. తన కోస్టార్స్, స్టాఫ్‌ను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరాడు. కిమ్ ఈ అపాలజీ స్టేట్‌మెంట్ ఇచ్చిన కాసేపటికే.. ‘టు డేస్ అండ్ వన్ నైట్’ షో మేకర్స్ ఓ పోస్ట్ రిలీజ్ చేశారు. ఈ షో ఫోర్త్ సీజన్‌లో కిమ్ ఉండబోడని.. తను నటించిన సీన్లను ఎడిట్ చేస్తామని ప్రకటించారు.

Advertisement

Next Story