- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిమ్ వచ్చేశాడు..!
ప్యొంగ్యాంగ్: ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత ఎక్కువగా చర్చించుకుంటున్న విషయం ఏదైనా ఉందంటే అది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించే. ఆయన ఆరోగ్యం క్షీణించిందనీ, ఒకానొక దశలో ఆయన బతికే ఉన్నారా అనే అంశంపై టీవీ ఛానళ్లలో స్పెషల్ ప్రోగ్రాంలు, దినపత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే, వీటన్నింటికీ తెరపడినట్టే కనిపిస్తోంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనీ, ప్రజల ముందుకు వచ్చారని ఆ దేశ అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు ఓ ఫ్యాక్టరీ వద్ద కిమ్ రిబ్బన్ కట్ చేస్తున్న ఫొటోను విడుదల చేసింది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ ప్రాంతంలో ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కిమ్‌తో పాటు తన సోదరి కిమ్ యో జోంగ్ కూడా పాల్గొన్నట్లు పేర్కొంది. కిమ్ కనిపించగానే అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారని తెలిపింది. అయితే, ఈ వార్తను కొరియా మీడియా తప్ప మరే అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు ధృవీకరించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, గత నెల 11 నుంచి కనిపించకుండా పోయిన కిమ్.. ఆ దేశ వ్యవస్థాపకుడి జయంతి ఉత్సవాల్లోనూ పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక పుకార్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే.
Tags: kim, KCNA, north korea, america, trump