జయలలిత నివాసంలో భారీగా బంగారం, వెండీ స్వాధీనం

by Shamantha N |
జయలలిత నివాసంలో భారీగా బంగారం, వెండీ స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌లోని ‘వేదనిలయంలో’ 4.3 కిలోల బంగారం, 601 కిలోల వెండి, ఇతర వస్తులు లభ్యమైయ్యాయి. జయలలిత మరణించడంతో ఆమె నివాసాన్ని ప్రస్తుత పళని సర్కార్ సార్మక చిహ్నంగా మారుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాదిలో మే నెలలో సర్కార్ వేదనిలయాన్ని స్వాధీనం చేసుకుంది.

చర ఆస్తులను పురచ్చి తలైవి డాక్టర్ జె. జయలలిత మెమోరియల్ ఫౌండేషన్‌కు బదిలీ చేశారు. జయలలిత నివాసంలో పూజ వస్తువులు, పలు వస్త్రాలు కలిపి మొత్తంగా 32,721 వస్తువులున్నాయని తేలింది. వేదనిలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం జులై 25వతేదీన సివిల్ కోర్టులో రూ.67.9 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed