అందాల ముద్దుగుమ్మకు అదిరే ఆఫర్

by Shyam |   ( Updated:2021-07-31 01:20:05.0  )
అందాల ముద్దుగుమ్మకు అదిరే ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ బంపర్ ఆఫర్ కొట్టిసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదట ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌‌‌గా నటిస్తోందని, ఇలా పలురకాల పేర్లు వినిపించినా చివరికి ఆ ఛాన్స్ బాలీవుడ్ భామ కియార అద్వానీ కొట్టేసింది. కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించనుందని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ గతంలో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో నటించి తన అందచందాలతో అదరగొట్టింది. ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ అమ్మడుని చిత్రయూనిట్ బర్త్‌డే విషెస్‌ తెలిపి, ఆమెకు వెల్‌కం అబోర్డ్‌ అంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా నటించనున్నట్లు టాక్. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.

Advertisement

Next Story