మారిన ఖుష్బూ నియోజకవర్గం.. ‘థౌజండ్’ వాలా పేల్చేనా..?

by Shamantha N |   ( Updated:2021-03-15 00:36:02.0  )
Khushboo
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎట్టకేలకు సినీ నటి ఖుష్బూ టికెట్ సాధించుకుంది. బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంతో అలక వహించింది ఆమె. పార్టీ కార్యకర్తలు, అభిమానులు సైతం షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లి లాబియింగ్ చేశారు. దీంతో ఆదివారం ప్రకటించిన రెండో జాబితాలో ఖుష్బూ పేరు ప్రకటించారు.

గతంలో డీఎంకేలో పని చేసిన ఖుష్బూ.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో కొసాగుతూనే ప్రధాని మోడీకి అనుకూలంగా ఆమె చేసిన ట్వీట్స్ తమిళనాడులో కలకలం సృష్టించాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి గుబ్ బాయ్ చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నుంచి చేపాక్కం-ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ.. బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుల్లో భాగంగా ఆ సీటు అన్నాడీఎంకేకు బీజేపీ కేటాయించింది. దీంతో ఆందోళన చెందిన ఖుష్బూ.. పార్టీ నేతలతో చర్చించడంతో చేపాక్కం-ట్రిప్లికేన్ నియోజకవర్గం పక్కనే ఉన్న థౌజండ్ లైట్స్ సీటును ఖరారు చేశారు. చేపాక్కం-ట్రిప్లికేన్ నుంచి ఆరు నెలల క్రితమే ప్రచారం మొదలు పెట్టిన ఖుష్బూ.. ప్రస్తుతం నియోజకవర్గం మారడంతో థౌజండ్ లైట్స్ కు షిఫ్ట్ అవుతున్నారు. మరి ఆమె ఈ ఎన్నికల్లో థౌజండ్ వాలా పేల్చుతారో లేదో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement

Next Story