మీడియాను క్షమాపణ కోరిన ఖుష్బూ

by Shyam |
మీడియాను క్షమాపణ కోరిన ఖుష్బూ
X

నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ మీడియాపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరింది. మీడియా గురించి అగౌరవంగా మాట్లాడటం తన ఉద్దేశమే కాదన్న ఖుష్బూ నటిగా 34 ఏళ్లుగా మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నానో గుర్తించాలన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? త్వరలో సీరియళ్ల షూటింగ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వాట్సాప్‌లో టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గ్రూప్‌నకు కొన్ని సూచనలిస్తూ ఆడియో క్లిప్ పెట్టింది. ‘ప్రస్తుతం మీడియాకు కరోనా తప్ప మరే న్యూస్ లేదు. మనం త్వరలో షూటింగ్ జరుపుకోబోతున్నాం కాబట్టి.. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వారికి దొరకకుండా జాగ్రత్త పడదాం’ అంటూ చెప్పింది. అయితే ఆ ఆడియోను ఎడిట్ చేసి మీడియాకు క్లిప్ అందించారట ఓ నిర్మాత.

దీంతో మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పింది ఖుష్బూ. ‘ఈ ఆడియో క్లిప్ సీరియల్ నిర్మాతల గ్రూప్ నుంచి రిలీజ్ అయింది. కానీ, ఇలాంటి మనుషులు మన మధ్య ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను’ అని తెలిపింది. మామూలుగా స్నేహితులతో ఎలా మాట్లాడతానో మీడియా గురించి కూడా అదే విధంగా మాట్లాడానని వివరణ ఇచ్చింది. నా మాటల్లో ఏదైనా తప్పుంటే దయచేసి క్షమించాలని కోరింది. ఈ ఆడియో ఎవరు రిలీజ్ చేశారో తెలిసినా ఇప్పుడు బయటపెట్టనని.. నా మౌనమే వారికి తగిన శిక్షగా భావిస్తున్నానని తెలిపింది.

Advertisement

Next Story