- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైవ్ వీడియోలో టాప్‌లెస్‌గా మోడల్.. అంగాంగ ప్రదర్శన అందుకేనా?
దిశ, సినిమా: హాలీవుడ్ యాక్ట్రెస్, రియాలిటీ స్టార్ క్లో కర్దాషియన్ ప్రైవేట్ ఫ్యామిలీ పార్టీలో తీసుకున్న బికినీ ఫొటోలు వైరల్ అయ్యాయి. తనకు తెలియకుండానే తన టీమ్ ఈ ఫొటోలను షేర్ చేయగా.. రిమూవ్ చేసేలోపే వైరల్ అయ్యాయి. ఆ తర్వాత తన లాయర్స్ ఈ ఫొటోలను ఇంటర్నెట్ నుంచి పూర్తిగా తొలగించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఈ స్టార్ మోడల్ తన బికినీ ఫొటోల్లో ఫ్యాట్‌గా, అగ్లీగా కనిపిస్తోందని.. అంటే ఇంతకుముందు షేర్ చేసిన ఫొటోలు ఫిల్టర్డ్ ఫొటోలేనా? అని విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇలా చేసి నెటిజన్ల మైండ్స్‌పై ఎఫెక్ట్ చూపాలని అనుకుందా? అంటూ పెద్ద కాంట్రవర్సీనే చెలరేగింది.
కాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన కర్దాషియన్.. తన ఫొటోస్ అన్నీ ఫొటోషాప్ కాదని నిరూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో టాప్‌లెస్ అండ్ బికినీ బాటమ్‌లో కనిపించి, తను నకిలీ కాదు నిజమేనని మిలియన్ ఫాలోవర్స్‌కు కాంట్రవర్సీపై సమాధానమిచ్చింది. ‘హే గాయ్స్.. నా బాడీ అన్‌రీటచ్డ్, అన్‌ఫిల్టర్డ్. ఈ వీక్ పోస్ట్ చేసిన ఫొటో బ్యూటిఫుల్‌గా ఉంది. సమాజంలో జీవితాంతం బాడీ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి బాడీ స్ట్రక్చర్ ఫొటో.. బ్యాడ్ లైటింగ్‌లో పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేయనప్పుడు, మీ స్టేటస్‌తో సంబంధం లేకుండా షేర్ చేయకూడదని చెప్పే రైట్ మీకు ఉంటుంది. లైఫ్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి, ఇతరుల అంచనాలను అందుకోవాలనుకునే క్రమంలో ఒత్తిడికి గురవుతున్నా. క్లో ఫ్యాట్ సిస్టర్, క్లో అగ్లీ సిస్టర్.. ఆమె తన తండ్రిలా అందంగా కనిపించడం లేదు కాబట్టి తను నిజంగా ఆమె తండ్రి కాడేమో. ఆమె బరువు తగ్గేందుకు ఏకైక మార్గం సర్జరీ అయి ఉండాలి’ వంటి కామెంట్లు విని విసిగిపోయానని క్లో చెప్పుకొచ్చింది.
ఎవరి నుంచి సింపతీ కోరుకోవడం లేదన్న క్లో కర్దాషియన్.. తాను పర్‌ఫెక్ట్ కాకపోవచ్చు కానీ హానెస్ట్‌గా బతుకుతున్నానని తెలిపింది. దీని అర్థం తన తప్పులు చేయడం లేదని కాదు కానీ, అబద్ధాలు చెప్పట్లేదని వివరించింది. ప్రజలకు తన మీద ఉన్న అంచనాల ప్రకారం బతకడం అనేది సాధ్యం కాదని పేర్కొంది. పదేళ్లుగా తన ఫొటోల్లో ఉన్న చిన్న చిన్న ఇంపర్‌ఫెక్షన్స్, మిస్టేక్స్‌పై చాలామంది నుంచి జోక్స్ వింటున్నా.. వాటన్నింటినీ పాజిటివ్‌గా తీసుకొని ముందుకు వెళ్తున్నాని వెల్లడించింది.