ఫ్యాన్స్‌కు ఖాన్స్ ట్రీట్..

by Shyam |
ఫ్యాన్స్‌కు ఖాన్స్ ట్రీట్..
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ లవర్స్‌కు క్రేజీ ట్రీట్ ఇవ్వనున్నారు ఖాన్స్. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అమీర్ చివరగా 2018లో వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాలో కనిపించగా.. అది కాస్తా డిజాస్టర్‌గా నిలిచిపోయింది. దీంతో తన ఫ్యాన్స్‌ను 100 శాతం ఎంటర్‌టైన్ చేసేందుకు ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టదలుచుకోలేని అమీర్.. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో షారుఖ్ గెస్ట్ అప్పియరెన్స్‌కు ప్లాన్ చేశాడు. అంతేకాదు ఇంటెన్సిటీ పెంచేందుకు ఈ సీన్స్ కూడా తనే డైరెక్ట్ చేశాడు. ఈ న్యూస్‌తో మూవీ లవర్స్, ఖాన్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

అంతేకాదు షారుఖ్ ఖాన్ కూడా ఈ ప్లాన్‌ను వర్కౌట్ చేసే పనిలో ఉన్నాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో రాబోతున్న ‘పఠాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించనున్నారని తెలుస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ కాగా.. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రం కోసం దీపికా రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని బాలీవుడ్ టాక్.

Advertisement

Next Story