- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీటీడీ ఆస్తులు అమ్మితే సహించం: కన్నా
దిశ ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులను అమ్మడం ద్వారా నిధులు సేకరించాలని టీటీడీ భావిస్తున్నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఆస్తులు విక్రయించే హక్కు మీకెక్కడిది? అంటూ ఆయన ప్రశ్నించారు.
తిరుమల వెంకన్నకు భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వ హక్కు అని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు టీటీడీ ఆస్తులను ప్రభుత్వమెలా వేలం వేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీనిని చూస్తుంటే హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగివుందనే అనుమానం కలుగుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. టీటీడీ విషయంలో బీజేపీ రాజీలేని పోరాటం సాగిస్తుందని ఆయన తెలిపారు.
కాగా, దేశంలోని అనేక ప్రాంతాల్లో శ్రీవారికి సంబంధించిన విలువైన ఆస్తులు ఉన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు నెలల పాటు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతివ్వలేదు. దీంతో ఆలయం ఆదాయం మందగించింది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి సంబంధించిన తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను విక్రయించడం ద్వారా 100 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని టీటీడీ నిర్ణయించినట్టు వార్తా కథనాలు వెలువడ్డ నేపథ్యంలో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.