లాక్‌డౌన్ ఉల్లంఘన.. 46 మందిపై కేసులు

by Shyam |   ( Updated:2020-04-12 07:18:09.0  )

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 46 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బోనకల్లు రోడ్డు శ్రీరామ్ హిల్స్, కొత్తూరు, అల్లిపురం, ఖానాపురం, హవేలి ప్రాంతాల్లో రోడ్లపై వాకింగ్ చేస్తున్న వారితోపాటు అకారణంగా బయటకు వచ్చిన 46 మందిని అదుపులోకి తీసుకుని అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ మురళీధర్ పర్యవేక్షణలో వారిపై కేసు నమోదు చేసినట్టు సీఐ వెంకన్న బాబు తెలిపారు. ఈ సందర్భంగా మురళీధర్ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ బయటకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. మరోసారి పునరావృతమైతే రిమాండ్‌కు తరలిస్తామని హెచ్చరించారు. అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేశారు. మురళీధర్‌తోపాటు ఏసీపీ వెంకటరెడ్డి, విజయబాబు, సీఐ అంజలి ఉన్నారు.

tags: khammam, lockdown, rules break, corona, virus, gcp muralidhar, ci venkanna babu

Advertisement

Next Story