- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖైరతాబాద్ బడా గణేషుడికి భారీ కండువా
దిశ, ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహా గణనాథుడికి సమర్పించేందుకు భారీ కండువా, జంజం, పట్టువస్త్రాలను సిద్ధం చేసినట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం తెలిపింది. బుధవారం స్థానిక ఆలయంలో గౌరీ తనయుడికి సమర్పించనున్న 60 అడుగుల కండువా, జంజం, గరికమాలతో పాటు పట్టువస్త్రాలను సంఘం అధ్యక్షులు శ్రీధర్, గౌరవ అధ్యక్షులు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలే స్వాములు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సాంప్రదాయబద్ధంగా శివ పుత్రునికి పట్టు వస్త్రాలతో వినాయకుడికి ఇరు వైపుల కొలువుదీరిన అమ్మవార్లకు వస్త్రాలను సమర్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ వస్త్రాలను ప్రత్యేక పూజల అనంతరం 40 రోజుల పాటు నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులచే వీటిని తయారు చేయించినట్లు తెలిపారు. పండగ రోజు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి కళాకారుల బృందంతో కలిసి పట్టువస్త్రాలను తీసుకువచ్చి సమర్పిస్తామని చెప్పారు.